అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రహాదారులపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈమేరకు ఇప్పటికే పలు ప్రాంతాల్లో రహాదారులను పునః నిర్మించింది. తాజాగా మరమ్మతులు చేయడానికి వీల్లేని రహదారుల అభివృద్ధికి రూ. 600 కోట్లు కేటాయింపులు చేసినట్లు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మెరుగైన రహదారులే లక్ష్యంగా నిధులు కేటాయింపులు జరిగాయని పేర్కొన్నారు. జిల్లా ప్రధాన రహదారులు (MDR), రాష్ట్ర హైవేలు (SH) పథకం కింద రోడ్లు మరియు భవనాల శాఖ ఆధ్వర్యంలో రోడ్ల అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు.
మరమ్మతులు చేయడానికి వీల్లేని రహదారుల అభివృద్ధికి రూ. 600 కోట్లు కేటాయింపులు
By admin1 Min Read