ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.259 కోట్లు అదనపు కేంద్ర నిధులను ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కేంద్రాన్ని కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు ఇతర మంత్రులతో భేటీ అయ్యారు. జాతీయ ఆరోగ్య మిషన్, ఇతర పథకాల కింద రాష్ట్రానికి అదనంగా రూ.259 కోట్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ సత్యకుమార్ యాదవ్ కోరారు. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆయన సమావేశమై ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి కావాల్సిన అంశాలకు సంబంధించి కేంద్ర టూరిజం, న్యాయ, అణుశక్తి శాఖ మంత్రులతో కూడా మంత్రి సత్యకుమార్ సమావేశమయ్యారు. రాష్ట్రానికి చెందిన పలు విషయాలపై వారితో చర్చించారు.
పలువురు కేంద్ర మంత్రులతో మంత్రి సత్య కుమార్ భేటీ… ఏపీకి చెందిన అంశాలపై చర్చ
By admin1 Min Read