ఇటీవల సంభవించిన భారీ భూకంపంతో తీవ్రంగా నష్టపోయిన మయన్మార్ కు ఆపన్నహాస్తం అందించి భారత్ తన దాతృత్వం మరోసారి చాటుకుంది. ఇప్పటికే బాధిత దేశానికి యుద్ధ ప్రాతిపదికన సహాయ సామాగ్రి అందజేసేందుకు ‘ఆపరేషన్ బ్రహ్మ’ తో సాయమందిస్తున్న భారత్ శుక్రవారం మయన్మార్‌లో భారీ భూకంపం సంభవించగా, ప్రధాని మోడీ ఆదేశాల మేరకు భారీ సహాయాన్ని పంపించడం జరిగింది. నిన్న కూడా 30 టన్నుల విపత్తు సహాయాన్ని తరలించారు. వివిధ రకాల ఆహార వస్తువులతో పాటు మెడికల్ సామాగ్రిని యాంగోన్‌కు పంపించారు. ఇండియన్ నేవీ షిప్ లు ఐఎన్ఎస్ కర్మూక్, ఎల్ సీ యూ 52 లలో 30 టన్నుల సాయాన్ని పంపినట్లు విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.

మయన్మార్ కు కొనసాగుతున్న భారత్ సాయం… మరోసారి అత్యవసర సామాగ్రి పంపిన భారత్
By admin1 Min Read

