ఏప్రిల్, మే, జూన్ ఈ మూడు నెలల పాటు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ (ఐఎండీ) అంచనా వేస్తోంది. ఎక్కువ ప్రాంతాల్లో గరిష్ట స్థాయిలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు అదే విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా పలు చోట్ల సాధారణం కంటే ఎక్కువ ఉంటాయని ఐఎండీ చీఫ్ మృత్యుంజయ మహాపాత్ర పేర్కొన్నారు. దేశంలోని ఎక్కువ భాగాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి పైగా ఉండనున్నాయి. పశ్చిమ మరియు తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో ఉండే అవకాశం ఉంది. అయితే, కనిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువ ప్రాంతాల్లో సగటును మించిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, హార్యానా, బీహార్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ వడగాలుల రోజులు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏప్రిల్ లో దేశంలో చాలా ప్రాంతాల్లో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వివరించారు.
ఈ మూడు నెలలు అదిరిపోయే ఎండలు.. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ రోజులు వడగాలులు
By admin1 Min Read