కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన ప్రకారం, 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రస్తుతం నక్సల్స్ ప్రభావిత జిల్లాల సంఖ్య 12 నుంచి 6కి తగ్గిందని, ఇది భద్రతా బలగాల చర్యలకు నిదర్శనమని పేర్కొన్నారు.ఛత్తీస్‌గఢ్ అడవుల్లో ఇటీవల వరుస ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పుల్లో అనేక మంది మావోలు హతమయ్యారు. మావోయిస్టు హింస, భావజాలాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు ఎన్డీయే ప్రభుత్వం కఠినమైన విధానాన్ని అవలంభిస్తోందని, ప్రధాని మోదీ నిర్ణయించుకున్న శాంతి స్థాపన లక్ష్యాన్ని సాధించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు అమిత్ షా తెలిపారు.2015లో 35 నక్సలైట్ ప్రభావిత జిల్లాలు ఉండగా,2018 నాటికి 30, 2021 నాటికి 2025కు తగ్గాయి.ఇప్పుడు 6 మాత్రమే మిగిలాయని అధికారిక నివేదికలు స్పష్టం చేశాయి.ఈ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అమిత్ షా ఏప్రిల్ 4, 5 తేదీల్లో ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించనున్నారు.అక్కడ నక్సలిజం నిర్మూలనపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.ఏప్రిల్ 7, 8 తేదీల్లో ఆయన జమ్ముకశ్మీర్‌లో పర్యటన చేయనున్నట్లు సమాచారం.
2026 నాటికి నక్సలిజానికి పూర్తిగా ముగింపు: – కేంద్ర హోంమంత్రి అమిత్ షా
By admin1 Min Read