ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి బర్డ్‌ఫ్లూ మరణం నమోదైంది. హెచ్5ఎన్1 వైరస్ బారినపడి రెండేళ్ల చిన్నారి మరణించడం తీవ్ర విషాదం కలిగించిందో. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని బాలయ్యనగర్‌కు చెందిన జ్యోతి అనే చిన్నారి (2) బర్డ్‌ఫ్లూతో ప్రాణాలు కోల్పోయినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు ధ్రువీకరించారు. అనారోగ్యానికి గురైన చిన్నారిని కుటుంబ సభ్యులు ఆమెను మంగళగిరిలోని ఎయిమ్స్ లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ వారం రోజుల క్రితం మృతి చెందింది. కాగా, ఆమెలో బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో అనుమానించిన డాక్టర్ లు నమూనాలను పూణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. తాజాగా, ఈ పరీక్షలకు సంబంధించిన నివేదిక హాస్పిటల్ కు అందింది. పరీక్షల్లో జ్యోతికి బర్డ్ ఫ్లూ సోకినట్టు నిర్ధారణ అయినట్టు వైద్యాధికారులు తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు