ప్రపంచ అత్యంత ధనికులుగా నిలిచిన వారి జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. 2025 బిలియనీర్ల జాబితాలో టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ $342 బిలియన్ నికర సంపదతో ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నారు. ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ $216 బిలియన్‌తో రెండో స్థానంలో ఉండగా, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ $215 బిలియన్‌తో మూడో స్థానాన్ని ఆక్రమించారు. భారతీయ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ $92.5 బిలియన్ సంపదతో ప్రపంచ ర్యాంకింగ్‌లో 18వ స్థానంలో నిలిచారు. మరో భారతీయుడైన గౌతమ్ అదానీ $56.3 బిలియన్‌తో 28వ స్థానంలో ఉన్నారు. అమెరికా 902 బిలియనీర్లతో ప్రపంచంలోనే అత్యధిక సంపన్నులు కలిగిన దేశంగా నిలిచింది. చైనా 516 బిలియనీర్లతో రెండో స్థానంలో, భారత్ 205 బిలియనీర్లతో మూడో స్థానంలో ఉంది. ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితాలో 288 మంది కొత్తగా చోటు సంపాదించుకున్నారు. వీరిలో కొంతమంది హాలీవుడ్ స్టార్లు, టెక్ సంస్థల వ్యవస్థాపకులు కూడా ఉన్నారు.
ఫోర్బ్స్ 2025 బిలియనీర్ల జాబితా: మస్క్ మళ్లీ టాప్‌లో, అంబానీ భారతీయం నెం.1
By admin1 Min Read