దేశవ్యాప్తంగా 900 రకాలకు పైగా ఔషధాల ధరలు పెరిగినట్టు నేషనల్ ఫార్మాస్యుటికల్ ప్రైజింగ్ అథారిటీ (NPPA) ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి.టోకు ద్రవ్యోల్బణ సూచీ (WPI) ఆధారంగా ఔషధ తయారీ సంస్థలుప్రభుత్వ అనుమతి లేకుండానే ధరలను సవరించుకునే అవకాశం ఉంది.ఇది నిత్యావసర ఔషధాలను వినియోగించే ప్రజలకు అదనపు భారం కలిగించనుంది.ఇప్పటికే వైద్య ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో,ఈ ధరల పెంపు సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపనుందని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ధరల పెంపు శాతం:- 1.74%
ప్రభావితమైన ఔషధాలు:-
– ఇన్ఫెక్షన్ల చికిత్సకు వాడే మందులు
– గుండె సంబంధిత వ్యాధుల ఔషధాలు
– షుగర్/డయాబెటిస్ మందులు
– పెయిన్ కిల్లర్లు