కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో హైకోర్టు రిజిస్ట్రార్ పంపిన మధ్యంతర నివేదికను సుప్రీంకోర్టు పరిశీలించింది.ఈ నివేదిక ఆధారంగా కోర్టు రాష్ట్ర ప్రభుత్వ చర్యలను నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని (CS) ప్రతివాదిగా చేర్చిన కోర్టు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఎలా సాధ్యమని ప్రశ్నించింది. జస్టిస్ గవాయ్ ధర్మాసనం ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించింది.కోర్టు,ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది.హైకోర్టు కూడా ఈ వ్యవహారంలో కీలక ఆదేశాలు ఇచ్చింది.ఇటీవల హైకోర్టులో ఈ వ్యవహారంపై విచారణ జరుగగా, 400 ఎకరాల్లో చెట్ల నరికివేతను తక్షణమే ఆపాలని ఆదేశించింది.పిటిషన్లను పరిశీలించిన అనంతరం, కేసును ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది.అప్పటివరకు భూముల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకూడదని స్పష్టం చేసింది. హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సి ఉందని, దీనికోసం అడ్వకేట్ జనరల్ (AG) గడువు కోరినట్లు సమాచారం.
Previous Articleకుంకుమ బొట్టు పెట్టుకోవద్దని,చేతికి కంకణం కట్టుకోవద్దని అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత ఏ రాజా
Next Article వక్ఫ్ సవరణ బిల్లుపై సోనియా గాంధీ విమర్శలు…!

