మహారాష్ట్రలో భాషా వివాదం మరోసారి ముదిరింది.లోనావాలాలో ఉన్న బ్యాంకులో మరాఠీ భాషను ఉపయోగించలేదన్న కారణంతో ఎంఎన్‌ఎస్ కార్యకర్తలు ఓ ఉద్యోగిపై దాడికి పాల్పడ్డారు.మహారాష్ట్ర నవనిర్మాణ సేన తరఫున బ్యాంకులు మరాఠీలోనే లావాదేవీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.ఈ క్రమంలో మంగళవారం వారు ఓ ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.లోకల్ బ్యాంకును సందర్శించిన కార్యకర్తలు సిబ్బందికి పూలతోపాటు రాళ్లు ఇచ్చారు.ఇది “మరాఠీలో సేవలు ఉంటే పువ్వు – లేకపోతే రాయి” అనే సంకేతంగా ఉందని తెలిపారు.రాష్ట్ర అధికార భాషకు తగిన గౌరవం కల్పించాలన్నది ఎంఎన్‌ఎస్ అభిప్రాయం.అన్ని జాతీయ,ప్రైవేట్ బ్యాంకులకూ ఇదే డిమాండ్‌ను పంపించనున్నారు.ఈ చర్యపై సామాజికంగా తీవ్ర చర్చ కొనసాగుతోంది.భాషపై ప్రేమను ప్రచారం చేయడం మంచి విషయమేనని,కానీ హింసాపూరితంగా జరగడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మహారాష్ట్ర:- మరాఠీ మాట్లాడలేదని బ్యాంకు ఉద్యోగిని కొట్టిన ఎంఎన్‌ఎస్ కార్యకర్త
By admin1 Min Read
Previous Articleవక్ఫ్ సవరణ బిల్లు-2025కి పార్లమెంట్ ఆమోదం
Next Article వక్ఫ్ సవరణ బిల్లు చారిత్రక ఘట్టం: ప్రధాని మోదీ