గతేడాది కాలంగా వినియోగదారుడికి చుక్కలు చూపించిన బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశీయంగా వీటి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో గత రాత్రి 11 గంటల సమయానికి 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ రూ. 2,400 తగ్గి రూ. 91 వేలకు చేరుకుంది. కిలో వెండి ధరపై ఏకంగా రూ. 8 వేలు తగ్గి రూ. 89,800కు దిగింది. ఏప్రిల్ 1న బంగారం ధర రూ. 94 వేలు దాటగా…ఇప్పటి వరకు రూ. 3 వేలు తగ్గింది. అలాగే, వెండి ధర రెండు రోజుల క్రితం రూ. 1.02 లక్షలు ఉండగా రూ. 12 వేలకు పైగా తగ్గింది. అంతర్జాతీయంగా ఔన్సు 24 క్యారెట్ ల ధర నిన్న ఒక్క రోజే 80 డాలర్లకు పైగా తగ్గడం, వెండి ధర కూడా అదే బాట పట్టడంతో దేశీయంగా వాటి ధరలు తగ్గాయి. ఇక తగ్గిన ధరలతో సామాన్యులకు కొంత ఉపశమనం లభించినట్లయింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు