నాటక రంగంలో అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా కందుకూరి పురస్కారాలను ఏపీ ప్రభుత్వం అందించనుంది. కళా, నాటక రంగాలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఏప్రిల్ 7వ తేదీలోగా ఎఫ్ డీసీ కార్యాలయానికి దరఖాస్తులు పంపాలని సూచించారు. ఏప్రిల్ 16వ తేదీన పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. ఇక రాజమహేంద్రవరంలో తాజాగా జరిగిన ‘అమరావతి చిత్రకళా వీధి’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దుర్గేష్ సాంప్రదాయ, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్న కళాకారులందరినీ అభినందించి, శాలువాలతో సత్కరించి, మెమెంటోలు అందజేశారు.
Previous Articleబంగారం, వెండి ధరలలో భారీ తగ్గుదల..!
Next Article వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్ చేరిన భారత బాక్సర్ హితేష్