అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చైనాకు మరోసారి గట్టి హెచ్చరిక ఇచ్చారు. అమెరికాపై విధించిన 34 శాతం రెసిప్రోకల్ టారిఫ్స్ ను వెంటనే రద్దు చేయాలని పేర్కొన్నారు. 24 గంటల్లో వాటిని రద్దు చేయకుంటే చైనాపై అదనంగా 50 శాతం టారిఫ్స్ విధిస్తామని హెచ్చరించారు. ఈ నిర్ణయం ఈ నెల 9 నుండి అమలులోకి వస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ మేరకు ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ట్రూత్ సోషల్’ లో ఒక పోస్టు పెట్టారు. ప్రపంచ దేశాలన్నీ అమెరికాపై భారీగా ట్యాక్స్ లు విధిస్తున్నాయని ఆరోపిస్తూ ట్రంప్ ఇటీవల విదేశాలపై టారిఫ్ లు విధించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే చైనాపైనా 34 శాతం టారిఫ్ లు విధిస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై చైనా తీవ్రంగా స్పందిస్తూ అమెరికాపైనా అంతే మొత్తంలో (34 శాతం) టారిఫ్ లు విధించింది. ఈ నెల 10 నుంచి ఈ టారిఫ్ లు అమలు చేయనున్నట్లు తెలిపింది. దీనిపై స్పందిస్తూ ట్రంప్.. ఈ టారిఫ్ లను విధించాలన్న నిర్ణయం నుండి వెనక్కి తగ్గాలని చైనాకు హెచ్చరికలు పంపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు