2008 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి తహవూర్ రాణా త్వరలో భారత్‌కు రానున్నాడు. 64 ఏళ్ల రాణా ప్రస్తుతం అమెరికాలో శిక్ష అనుభవిస్తున్నాడు. భారత్ ప్రభుత్వ అభ్యర్థనపై అమెరికా అతడిని అప్పగించేందుకు సిద్ధమైంది. ఢిల్లీ, ముంబై జైళ్లలో ఇప్పటికే భద్రతా ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రాణా భారత్‌లోకి వచ్చిన వెంటనే, జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అతడిని కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. గతంలో రాణా తన అప్పగింతను courtల్లో చాలెంజ్ చేసినా, అమెరికా సుప్రీంకోర్టు కూడా ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. 26/11 దాడిలో రాణా లష్కరే తోయిబా, ఐఎస్ఐ సంస్థలతో కలిసి కీలక పాత్ర పోషించాడు. ఈ దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో న్యాయం జరిగేందుకు భారత్ ఆతృతగా ఎదురు చూస్తోంది.
26/11 ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారి తహవూర్ రాణా భారత్‌కు తరలింపు…!
By admin1 Min Read
Previous Articleకాజీరంగా నేషనల్ పార్క్‌లో సచిన్ సఫారీ….!
Next Article జూన్ 6న నుండి భక్తులకు అందుబాటులోకి రామ్ దర్బార్..!