ప్రభాస్‌తో దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా రూపొందించనున్న ‘స్పిరిట్’ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ఇప్పటి వరకూ ఇండియన్ సినిమాల్లో ఎన్నో కాప్ కథలు వచ్చినా, ‘స్పిరిట్’లో చూపించబోయే పోలీస్ పాత్ర పూర్తిగా విభిన్నంగా ఉంటుందని దర్శకుడు స్వయంగా చెప్పారు. “ఇది ఒక కథకుడిగా నా భరోసా – ఈ తరహా పోలీస్‌ను ఇండియన్ ఆడియన్స్ ఇప్పటివరకు చూడలేదు,” అని సందీప్‌రెడ్డి తెలిపారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందనీ, హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తి చేసారని తెలిపారు.
ప్రస్తుతం నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టిన సందీప్, ఈ చిత్రంలో కొరియన్, అమెరికన్ నటులూ భాగస్వామ్యం కానున్నట్టు సమాచారం. మరొక హైలైట్ ఏమంటే, మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి ఇందులో కీలక పాత్ర పోషించనున్నారు. ఆయన పాత్ర అత్యంత శక్తివంతంగా ఉండనుందని చిత్రబృందం చెబుతోంది. ‘స్పిరిట్’ షూటింగ్ ఈ ఏడాది ద్వితీయార్థంలో మొదలవనుంది. టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి. ప్రభాస్ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచే చిత్రంగా ఇది రూపుదిద్దుకోనుంది.

