విశాఖపట్నం – విజయవాడ మధ్య ఉదయాన్నే నడిచే రెండు విమాన సర్వీసులు రద్దయ్యే చర్య తీవ్ర అసౌకర్యానికి దారి తీసింది.ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.ఆయన తన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ, విశాఖ నుండి విజయవాడ వెళ్లాలంటే హైదరాబాద్ మీదుగా ప్రయాణించాల్సిన పరిస్థితి దుస్థితిని సచిస్తుందన్నారు.ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన, హైదరాలో బాద్‌లో మారి విజయవాడ చేరేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అయిందని తెలిపారు. ఇదే దారిసీఐఐ, ఫిక్కీ వంటి సంస్థల ప్రతినిధులు కూడా ప్రయాణించాల్సి వచ్చింది. మంగళవారం రోజుల్లో వందే భారత్ రైలు లేకపోవడం కూడా మరో ప్రధాన సమస్యగా మారింది. రాష్ట్రంలో లోపభూయిష్టమైన విమానా సేవలు ప్రజలకు ఇబ్బందిగా మారుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశానికి వచ్చే ప్రతినిధులకే ఇలా అయితే, సాధారణ ప్రజల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై వెంటనే స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
విశాఖ నుండి అమరావతికి రావాలంటే హైదరాబాద్ మీదగా రావాలా ?:-టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
By admin1 Min Read