ప్రపంచ వ్యాప్తంగా టెక్ రంగంలో సంచలనం సృష్టించిన ఓపెన్‌ఏఐ ఇప్పుడు సోషల్ మీడియా రంగంలోకి అడుగుపెట్టేందుకు సన్నద్ధమవుతోంది.ప్రముఖ అమెరికా న్యూస్ వెబ్‌సైట్ ‘ద వెర్జ్’ వెల్లడించిన కథనం ప్రకారం,ఎలాన్ మస్క్‌కి చెందిన ‘ఎక్స్’కి ప్రత్యామ్నాయంగా ఓపెన్‌ఏఐ కొత్త యాప్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు సమాచారం.ఈ యాప్‌కు సంబంధించిన ప్రాథమిక నమూనాపై చాట్‌జీపీటీ టెక్నాలజీ ఆధారంగా కసరత్తు జరుగుతోందని తెలిపింది.ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ ఈ ప్రాజెక్టుపై బాహ్య వ్యక్తుల నుంచి ప్రైవేట్ ఫీడ్‌బ్యాక్‌ను తీసుకుంటున్నట్లు కూడా కథనంలో పేర్కొంది.ఇటీవల ఎలాన్ మస్క్ ఓపెన్‌ఏఐపై ఆస్తి హక్కుల పోరాటం ప్రారంభించగా,ఆల్ట్‌మన్ వ్యతిరేక దిశగా స్పందించినట్టు తెలుస్తోంది.దీంతో ‘ఎక్స్’కి ప్రత్యామ్నాయంగా ఓపెన్‌ఏఐ యాప్‌ను తీసుకురావాలన్న ఆలోచన ఉదయించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ రుమొరెడ్ (rumored) యాప్ ఏ విధంగా రూపుదిద్దుకుంటుందో తెలియాల్సి ఉన్నప్పటికీ,ఏఐ ఆధారిత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై ఆసక్తి నెలకొంది.టెక్ పరిశ్రమలో ఇది మరో భారీ పోటీగా మారే అవకాశముంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు