దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల జోరు కొనసాగుతోంది. అమెరికా చైనాల మధ్య టారిఫ్ వార్ అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు ఉన్నా నేటి ట్రేడింగ్ లో కూడా భారీ లాభాలతో ముగించాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 1508 పాయింట్లు లాభపడి 78 ,553 వద్ద స్థియపడగా… నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ కూడా దాదాపు 414 పాయింట్ల లాభంతో 23,851 వద్ద స్థిరపడింది ముగిసింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లో నమోదిత కంపెనీల విలువ రూ.4 లక్షల కోట్లకు పెరిగి రూ.419 లక్షల కోట్లకు చేరింది. ఐసీఐసీఐ బ్యాంక్, సన్ ఫార్మా, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, జొమాటో షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.
Previous Articleమహిళల రక్షణ, యువత భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం చర్యలు
Next Article క్రీస్తు చూపిన మార్గం అనుసరణీయం..!