ఉగ్రవాదం పేరుతో మారణహోమం చేస్తే ఏ దైవం సహించదని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. మన దేశ సార్వభౌమత్వాన్ని రక్షించేందుకు, ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు ప్రధాని మోడీ అనేక చర్యలు చేపడుతున్నారని తెలిపారు. పహల్గామ్‌లో నిన్న జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మన రాష్ట్రానికి చెందిన విశాఖపట్నం వాసి శ్రీ జెఎస్ చంద్రమౌళి గారు, మరియు కావలికి చెందిన శ్రీ మధుసూదన్ గారి మరణ వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ క్లిష్ట సమయాన్ని ఎదుర్కోగల ఆత్మస్థైర్యాన్ని ఆ భగవంతుడు వారికి ప్రసాదించాలని కోరుకుంటున్నానని ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఈ దారుణమైన చర్యకు బాధ్యులైన వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇక జమ్మూ కాశ్మీర్ నుండి పర్యాటకులు తిరిగి స్వస్థలాలకు తరలించేందుకు ప్రత్యేక విమానాలు కూడా నడుపుతున్నారు.
ఈ దారుణమైన చర్యకు బాధ్యులైన వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
By admin1 Min Read