జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిపై దేశంలోని చాలా మంది ప్రముఖులు, క్రికెటర్లు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయంపై పాకిస్థాన్ క్రికెటర్ కూడా స్పందించారు. ఈ పహల్గాం ఉగ్రదాడిని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ఖండించారు. దీనితో పాటు ఆయన పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
పహల్గాం ఉగ్రవాద దాడిలో పాకిస్థాన్ ప్రమేయం లేకపోతే ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఇంకా దానిపై ఎందుకు స్పందించలేదు? మీరు అకస్మాత్తుగా సైన్యాన్ని ఎందుకు అప్రమత్తంగా ఉంచారు? ఎందుకంటే నిజం ఏమిటో మీకు తెలుసు. మీరు ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారు. మద్దతు ఇస్తున్నారు. మీరు సిగ్గుపడాలి.’ అంటూ డానిష్ కనేరియా రాసుకొచ్చారు.
పాక్ ప్రమేయం లేకపోతే ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఉగ్రదాడి ఎందుకు ఖండించలేదు:డానిష్ కనేరియా
By admin1 Min Read