ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో స్పౌజ్ పెన్షన్ల కోసం నేటి నుండి దరఖాస్తులు స్వీకరించనుంది. ఈ కేటగిరీ కింద కొత్తగా 89,788 మందికి పెన్షన్లు అందించనుంది. ఎన్‌టీఆర్ భరోసా కింద పింఛన్ పొందుతున్న భర్త చనిపోతే భార్యకు తదుపరి నెల నుండే పెన్షన్ అందించేలా ఈ కేటగిరీని తీసుకొచ్చింది. గతేడాది నవంబర్ నుండే దీన్ని అమలు చేస్తోంది. లబ్ధిదారులకు రూ. 4వేల చొప్పున అందిస్తోంది. కాగా, అంతకుముందు 2023 డిసెంబర్ 1 నుండి 2024 అక్టోబర్ 31 మధ్య ఉన్న ఇదే కేటగిరీకి చెందిన అర్హులకూ పింఛన్ అందించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ తాజాగా ఆదేశాలిచ్చింది. అర్హురాలైన మహిళ… భర్త డెత్ సర్టిఫికెట్ తో పాటు తన ఆధార్ కార్డు, ఇతర వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందించాల్సి ఉంటుంది. దీంతో నేటి నుంచే ఈ వివరాలు తీసుకోనున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు