ఇటీవల జమ్మూ & కాశ్మీర్ లోని పహల్గామ్ ప్రాంతంలో ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.ఈ మేరకు ముందస్తు జాగ్రత్తగా తిరుమలలో ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను లేపాక్షి సర్కిల్ వద్ద ఉన్న సుదర్శన్ సత్రంలో గురువారం సాయంత్రం భద్రతా దళాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి.తిరుమలకు వచ్చిన భక్తులను అప్రమత్తం చేసేందుకు ఈ మాక్ డ్రిల్ నిర్వహించినట్లు తెలుస్తుంది.




