ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ నేడు తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. అనారోగ్య సమస్యతో ఆయన కన్నుమూశారు. కస్తూరి రంగన్ గతంలో జే.ఎన్.యూ ఛాన్సలర్ గా, కర్ణాటక నాలెడ్జ్ కమిషన్ ఛైర్మన్ గా పనిచేశారు. తొమ్మిదేళ్లపాటు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)కి ఆయన చైర్మన్ గా పని చేశారు. 2003-09 మధ్య రాజ్యసభసభ్యుడిగానూ ఉన్నారు. 2004 నుండి 2009 మధ్య కాలంలో బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ కు డైరెక్టర్ గా పనిచేశారు. ఎన్డీయే నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ముసాయిదా కమిటీకి ఆయన అధ్యక్షుడిగా వ్యవహరించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు