ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో నేడు పర్యటించారు. తమ ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటుందని స్పష్టం చేశారు. పిఠాపురం టౌన్ లో 30 గదులతో కూడిన 100 పడకల ఆసుపత్రి నిర్మాణం శంకుస్థాపన చేశారు . ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి. 30 పడకల నుండి 100 పడకల ఆసుపత్రిగా ఆధునీకరణకు శ్రీకారం చుట్టామన్నారు. 2 కొత్త బ్లాకులు, ఓపీ వార్డు, మార్చరి వార్డు, డయాలసిస్, బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయనున్నారు. అధునాతన పరికరాల అందుబాటులోకి తీసుకురానున్నారు. నూతనంగా డెర్మటాలజీ, ఆప్తమలజీ, రేడియాలజీ, పేథాలజీ, ENT డిపార్టుమెంటుల ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా పిఠాపురం టౌన్ ప్రజలకు మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న 6 మండల ప్రజలకు మెరుగైన వైద్య వెసులుబాటు ఉంటుంది. యు.కొత్తపల్లి టిటిడి కళ్యాణ మండపం శంకుస్థాపన, చేబ్రోలు శ్రీ సీతారామ స్వామి ఆలయ రథశాల, మండపం శంకుస్థాపన చేశారు. వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.
పిఠాపురంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పర్యటన… పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
By admin1 Min Read