కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతాల్లో రూ.1300 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం,గిరిజన సంక్షేమ శాఖామంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. లక్ష ఎకరాల్లో అరకు కాఫీ పెంపకానికి చర్యలు, గిరిజన ప్రాంతాల్లో 1000 కోట్ల రూ.లతో రహదారుల అభివృద్ది, 1600 గిరిజన గ్రామాల్లో తాగునీటి వసతి కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. 1100 అంగన్వాడీ కేంద్రాల్లో 53 కోట్ల రూ.లతో.తాగునీటి సౌకర్యం, 6 ఐటిడిఏల్లో ఒక్కొక్కటి కోటి రూ.ల ఖర్చుతో 6 గిరిజన బజారులు ఏర్పాటు చర్యలు, ప్రతి గిరిజన అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక కంటెయినర్ హాస్పిటల్ వంటి సౌకర్యాలను ప్రజల కోసం తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక గిరిజన ప్రాంతాల్లో రూ.1300 కోట్లతో అభివృద్ధి పనులు
By admin1 Min Read