వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (WAVES) ముంబై లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఘనంగా ప్రారంభమైంది. నాలుగు రోజులపాటు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సును ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ ఈ వేవ్స్ కేవలం పదం కాదని.. ఇది సంస్కృతి, సృజనాత్మకత, చలనచిత్ర సంగీతం, గేమింగ్, కథ చెప్పడం.. లాంటి కలయిక అంటూ.. పేర్కొన్నారు. గత 100 సంవత్సరాలలో, భారతీయ సినిమా ఉన్నత శిఖరాలకు చేరుకుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశ సృజనాత్మక ప్రతిభకు ఈ వేవ్స్ సమ్మిట్ ప్రపంచ వేదికగా నిలవనుంది. మన దేశం సృజనాత్మక ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పడంతో పాటు ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం అలాగే వీడియో గేమింగ్, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో భారత్ ను హబ్ గా చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ సమ్మిట్ నిర్వహిస్తోంది. భారత ప్రభుత్వం ‘కనెక్టింగ్ క్రియేటర్స్.. కనెక్టింగ్ కంట్రీస్’ అనే ట్యాగ్ లైన్ తో ఈ వేవ్స్ సమ్మిట్ ను నిర్వహిస్తోంది. వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. రజనీకాంత్, చిరంజీవి, మిథున్ చక్రవర్తి, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ తదితరులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు కూడా పాల్గొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు