నేడు అట్టహాసంగా అమరావతి పునర్నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికుతూ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ పనులను పునః ప్రారంభించేందుకు ఈరోజు రాష్ట్రానికి విచ్చేస్తున్న గౌరవ భారత ప్రధాని మోడీ హృదయపూర్వక స్వాగతం… సుస్వాగతం. ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు ప్రతిరూపంగా రూపుదిద్దుకుంటున్న ప్రజా రాజధాని అమరావతి పున్నిర్మాణాన్ని మీ అమృత హస్తాలతో ప్రారంభిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పవన్ ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
అమరావతి పునర్నిర్మాణాన్ని మీ అమృత హస్తాలతో ప్రారంభిస్తున్నందుకు ధన్యవాదాలు: డిప్యూటీ సీఎం పవన్
By admin1 Min Read