ప్రస్తుతం పాకిస్థాన్ తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) పరీక్షలన్నీ వాయిదా వేస్తున్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం మే 9 నుండి 14 వరకు సీఏ ఇంటర్మీడియట్, ఫైనల్, పోస్ట్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్స్ జరగాల్సి ఉంది. అయితే, దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు ఐసీఏఐ తెలిపింది. తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియజేస్తామని వివరించింది. ఎగ్జామ్స్ కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు ఐసీఏఐ వెబ్సైట్ icai.orgలో అధికారిక నోటీస్ చెక్ చేసుకోవాలని సూచించింది.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సీఏ ఎగ్జామ్స్ వాయిదా… వెల్లడించిన ఐసీఏఐ
By admin1 Min Read