భారత్-పాక్ ల మధ్య కాల్పుల విరమణను విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించిన విషయం విదితమే. విక్రమ్ మిస్రీ పై పలువురు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ట్రోలింగ్ పై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఖండించారు. మిస్రీ అద్బుతంగా పని చేశారని కొనియాడారు. ‘సంఘర్షణలు జరుగుతున్న వేళ విక్రమ్ మిస్రీ అద్భుతమైన పనితీరు కనబరిచినట్లు తెలిపారు. ఆయన చాలా కష్టపడ్డారని భారత్ గొంతును బలంగా వినిపించారని అలాంటి అధికారిని ఎవరు? ఎందుకు? ట్రోల్ చేస్తున్నారో తనకు అర్ధం కావడం లేదని శశి థరూర్ అన్నారు. ఆయనను విమర్శించే వారు అంతకంటే భిన్నంగా, మెరుగ్గా పనిచేయగలరా? అని ప్రశ్నించారు. ఈ సందర్బంగా శశి థరూర్, భారత ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పనితీరును కూడా అభినందించారు.
మిస్రీ చాలా బాగా పనిచేశారు… ట్రోల్స్ ను ఖండించిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
By admin1 Min Read
Previous Articleచివరి నిమిషంలో విమానం దిగి… ఆటగాళ్లలో భరోసా నింపిన పాంటింగ్
Next Article సీజ్ ఫైర్ …ప్రశాంతంగా భారత్-పాక్ సరిహద్దు