మహానాడు ఏర్పాట్లపై పొలిట్ బ్యూరో సమావేశానికి ముందు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మహానాడు కమిటీల కన్వీనర్లు, కో కన్వీనర్లతో టీడీపీ అగ్రనేత లోకేష్ సమావేశం నిర్వహించారు. మహానాడు ఏర్పాట్ల గురించి నేతలతో చర్చించారు. అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి పండుగ వాతావరణంలో మహానాడును నిర్వహించడం జరుగుతోందిమని పార్టీ కష్టకాలంలో ఉన్నా, అధికారంలో ఉన్నా మహానాడును నిర్వహించామని ఈ సందర్భంగా అన్నారు. పార్టీ ఆవిర్భావం తర్వాత చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తిరుగులేని మెజార్టీ సాధించాం. కడపలో నిర్వహించే మహానాడుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని నేతలను కోరారు.
Previous Articleజులై 4న రానున్న ‘కింగ్ డమ్’
Next Article రవీంద్ర జడేజా ఆల్ రౌండర్ నెంబర్ వన్… అరుదైన ఘనత