మన భారతీయ త్రివర్ణ పతాక రంగులతో చంద్రగిరి కోట కాంతులతో వెలిగిపోతోంది. మన సాయుధ దళాల్ని వారు దేశానికి చేసిన వారి నిస్వార్థ సేవను గౌరవిస్తూ త్రివర్ణ పతాక రంగులతో కాంతులీనుతోందని ఏపీ సీఎం చంద్రబాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తిరుపతిలో ఉన్న ఈ కోట ఆంధ్రప్రదేశ్ గత కాలపు శిల్పకళా వైభవాన్ని మరియు సాంస్కృతిక ఖ్యాతిని ప్రతిబింబిస్తుందని తెలిపారు. దురదృష్టవశాత్తూ, ఇటీవలి సంవత్సరాల్లో దీని సంరక్షణ నిర్లక్షించబడిందని, అయితే ఈ కోటను పునరుద్ధరించి, జీవం పోసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలను ప్రారంభించిందని పేర్కొన్నారు. దీని ద్వారా ఇది భారత వారసత్వ పటంలో తగిన స్థానం తిరిగి పొందేలా చేస్తున్నట్లు తెలిపారు. చారిత్రక స్మారకాలను సంరక్షించడం ద్వారా, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరచిపోయిన అధ్యాయాన్ని ప్రజలకు గుర్తుకు తీసుకువస్తున్నామని చంద్రబాబు అన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు