ఎన్టీఆర్ తెలుగు సంస్కృతి, సినిమా, సమాజ సేవల్లో తనదైన ముద్ర వేశారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.తెలుగు జాతి గర్వించదగ్గ మహానీయుడు టీడీపీ వ్యవస్థాపకులు ఏపీ మాజీ సీఎం నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా ఆయనకు హృదయపూర్వక నీరాజనమని పేర్కొన్నారు. మాయాబజార్, మిస్సమ్మ, సంపూర్ణ రామాయణం వంటి అనేక చిత్రాలలో అజరామర నటనతో చిరస్థాయిగా నిలిచిపోయారని “సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు” అనే అక్షర సత్య ఆలోచన, రాజకీయాల పట్ల ఎన్టీఆర్ గారి దృక్కోణాన్ని తెలియచేస్తుందని కొనియాడారు.
రెండు రూపాయలకు కిలో బియ్యం, మహిళలకు ఆస్తి హక్కులో వాటా, విద్యావకాశాల విస్తరణలో భాగంగా ఎంసెట్ ప్రవేశ పరీక్షను ప్రారంభించడం, ఈ రోజు మహానాడు జరిగే కడప ప్రాంతానికి నీళ్లు అందించే తెలుగుగంగ ప్రాజెక్ట్ వంటి అనేక చారిత్రక నిర్ణయాలతో ఎన్టీఆర్ గారు ప్రజల గుండెల్లో నిలిచిపోయారని అన్నారు. ఆయన స్థాపించిన ఎన్టీఆర్ ట్రస్ట్, బసవతారకం కాన్సర్ ఆసుపత్రి ప్రజా సేవలో ఆయన విజన్‌ను ఈ రోజుకీ కొనసాగిస్తోంది. ఈ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఆదర్శాలను స్మరించుకుంటూ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని, సంస్కృతిని, సమైక్యతను కాపాడుకుంటూ, ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలి అని పవన్ ఆకాంక్షించారు.
ఎన్టీఆర్ తెలుగు సంస్కృతి, సినిమా, సమాజ సేవల్లో తనదైన ముద్ర వేశారు: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
By admin1 Min Read
Previous Articleప్రజాస్వామ్యానికి కొత్త అర్ధం చెప్పిన దార్శనికుడు ఎన్టీఆర్
Next Article రాజ్యసభకు కమల్ హాసన్… డీఎంకే అధికారిక ప్రకటన