దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గతంలో ప్రపంచాన్ని వణికించిన ఈ మహమ్మారి, ఇప్పుడు మరోసారి విజృంభిస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది, మరణాలు కూడా నమోదవుతున్నాయి.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం… నిన్నటి వరకు 4,302గా ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య, ఈరోజు 4,866కు చేరింది. కేవలం 24 గంటల వ్యవధిలో 564 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా ఏడుగురు కోవిడ్ కారణంగా మరణించారు. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో అత్యధికంగా 1,487 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆ తర్వాతి ఢిల్లీలో 562, పశ్చిమ బెంగాల్ 538, మహారాష్ట్ర 526, గుజరాత్ 508 కేసులు ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కరోజే 105 కొత్త కేసులు వెలుగుచూడటం గమనార్హం. ఈ ఏడాది ప్రారంభం నుండి ఇప్పటివరకు మొత్తం 44 కోవిడ్ సంబంధిత మరణాలు నమోదయ్యాయని, వీరిలో ఎక్కువ మంది ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారేనని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
Previous Articleవీర మహిళా బృందం ఇచ్చిన మొక్కను నాటిన ప్రధాని మోడీ
Next Article అయోధ్య రామమందిరంలో వైభవంగా ప్రతిష్టాపన మహోత్సవం