నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి 11 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తన పదవీకాలంలో ఇప్పటివరకూ అందుకున్న విజయాలను ’11 ఏళ్ల సేవ’ పేరుతో సోషల్ మీడియా ‘ఎక్స్’ ద్వారా మోడీ పంచుకున్నారు. ఎన్నో కీలక మార్పుల్ని అత్యంత వేగంగా, భారీ పరిమాణంలో తమ ప్రభుత్వం పూర్తి చేసి చూపించిందని తెలిపారు. 81 కోట్ల మందికి ఉచిత ఆహారధాన్యాలు, 15 కోట్ల మందికి కొళాయి కనెక్షన్లు, పేదల కోసం నాలుగు కోట్ల ఇళ్ల నిర్మాణం, దేశవ్యాప్తంగా 12 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం వంటివి ఆయన ప్రస్తావించారు. మంత్రిమండలిలో 60 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలవారే ఉన్నట్లు వివరించారు. వీరికి ఈ స్థాయిలో పదవులు కేటాయించడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. ఈ 11 ఏళ్ల సమయంలో పాలనలో దేశం అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించడంతోపాటు వాతావరణ మార్పులు, డిజిటల్ చేంజెస్ వంటి అంశాల్లో ప్రపంచ వేదికపైనా బలమైన ముద్ర వేసిందని ప్రధాని మోడీ అన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు