మురుగ భక్తర్గళ్ మానాడుకి ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం అందింది. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నైనిటాల్ పవన్ కళ్యాణ్ ను ఈరోజు కలిసి ఆహ్వానించారు. హిందూ మున్నాని సంస్థ ఈ నెల 22వ తేదీన మధురైలో నిర్వహించనున్న మురుగ భక్తర్గళ్ మానాడు (సమ్మేళనం)కి ముఖ్య అతిథిగా హాజరు కావాలని నైనార్ నాగేంద్రన్ పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు. నాగేంద్రన్ తోపాటు బీజేపీ నాయకులతో కూడిన బృందం పవన్ తో భేటీ అయింది.
ఈ సందర్భంగా మధురైలో నిర్వహించే మురుగన్ భక్తుల సమ్మేళనానికి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్లు తెలియచేశారు. తమిళనాడులో ఆరు ముఖ్య షణ్ముఖ క్షేత్రాలు కొలువైన క్రమంలో అక్కడ చేపడుతున్న ఈ సమ్మేళనం ఆధ్యాత్మికంగా, సనాతన ధర్మ పరిరక్షణపరంగా ఎంతో ప్రత్యేకమైనదని, ఈ కార్యక్రమంలో ముఖ్యోపన్యాసం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులతో వర్తమాన రాజకీయ పరిణామాలపైనా, పలు అంశాల గురించీ పవన్ చర్చించారు. ఈ భేటీలో బీజేపీ తమిళనాడు వ్యవహారాల ఇంఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, బీజేపీ తమిళనాడు నేతలు తదితరులు పాల్గొన్నారు.
మురుగ భక్తర్గళ్ సమ్మేళనం కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ను ఆహ్వానించిన తమిళనాడు బీజేపీ నేతలు
By admin1 Min Read
Previous Articleఇజ్రాయెల్ -ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత పౌరులకు అడ్వైజరీ
Next Article నష్టాలతో ట్రేడింగ్ ముగించిన దేశీయ స్టాక్ మార్కెట్లు