అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మంథనా ప్రధాన పాత్రధారులుగా, వైవిధ్య చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా చిత్రం ‘కుబేర’. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామా సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ ట్రైలర్ సినిమాలోని కీలక అంశాలను, పాత్రల శైలిని పరిచయం చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ట్రైలర్ లోని విజువల్స్, దేవి శ్రీ ప్రసాద్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వం భావోద్వేగాలతో పాటు, యాక్షన్ సన్నివేశాలు కూడా సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ముఖ్యంగా, డబ్బు చుట్టూ తిరిగే కథలో మానవ సంబంధాలు, నైతిక విలువలు వంటి అంశాలను స్పృశిస్తూ తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు