శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో జరుగుతున్న మెగా పీటీఎం 2.0 కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్ల సమావేశంలో పాల్గొని విద్యార్థులు వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు పరిశీలించారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచనలిచ్చారు. విద్యార్థులకు చంద్రబాబు పాఠాలు చెప్పారు. లోకేష్ కూడా తరగతి గదిలో విద్యార్థులతో కలిసి కూర్చున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందివిద్యార్థులు-తల్లితండ్రులు- ఉపాధ్యాయులు హాజరైనట్లు తెలుస్తోంది. ఇలాంటి మీటింగ్స్ జరగటం వలన తల్లిదండ్రులు స్కూలుకి రావడం వల్ల తమ పిల్లలకు అందుతున్న విద్యా విలువలు, మౌలిక సదుపాయాలు తెలుసుకోవడానికి, విద్యార్థి ఎలా చదువుతున్నారు అని వాకబు చేసుకోవడానికి వీలు కలుగుతుంది. ఒక రైతు పంటవేశాక ఏ విధంగా అయితే పొలానికి వెళ్లి పంట పరిశీలిస్తూ ఉంటాడో,, అలాగే ఒక తల్లిదండ్రి తమ పిల్లలు చదువుతున్న పాఠశాలకు వెళ్లి.. విద్యార్థుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నాయకులు టీచర్స్ తల్లిదండ్రులు ఎక్కడైతే సమన్వయంగా ఉంటారో అక్కడ మంచి ఫలితాలు మంచి అభివృద్ధి సాధ్యమవుతుందని పలువురు నాయకులు చెబుతున్నారు.
మెగా పీటీఎం 2.0 కార్యక్రమంలో విద్యార్థులతో మమేకమైన ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్
By admin1 Min Read