బాపట్ల మున్సిపల్ హై స్కూల్‌లో 24 గదులు, డైనింగ్ హాల్, ల్యాబ్స్‌తో కూడిన మౌలిక వసతుల కల్పన యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేసిన కృషిలో భాగమైన అందరినీ ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అభినందించారు. గత ఏడాది డిసెంబర్ 7న మెగా పీటిఎం బాపట్ల మున్సిపల్ హైస్కూల్‌లో అత్యంత ఘనంగా నిర్వహించిన సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య కమిటీ సీఎం గారి దృష్టికి పాఠశాల సమస్యలు తీసుకొచ్చారని ఆనాడు అదే వేదికపై నుంచి హామీ ఇచ్చిన సీఎం గారు, ఏడాదిలోగా అన్ని వసతులు కల్పించాలని మాకు ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. తాము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. మంచి ఫలితాలు సాధించి బాపట్ల మున్సిపల్ హై స్కూల్ పేరు నిలబెట్టాలని విద్యార్థులు, ఉపాధ్యాయులను కోరారు.
మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం… మీరు మంచి ఫలితాలు సాధించి పేరు నిలబెట్టాలి: మంత్రి నారా లోకేష్
By admin1 Min Read
Previous Articleమనసుకు చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉంది: ఏపీ సీఎం చంద్రబాబు
Next Article ఏపీ క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు