యష్ రాజ్ ఫిల్మ్స్ వంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలో అగ్ర కథానాయకులు ఎన్టీఆర్ -హృతిక్ రోషన్ లు ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘వార్-2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుండి నేడు ట్రైలర్ ను విడుదల చేశారు. అత్యద్భుతమైన విజువల్స్, నిర్మాణ విలువలతో వచ్చిన ట్రైలర్ అంచనాలను మరింత పెంచేసింది. ముఖ్యంగా ఎన్టీఆర్ హృతిక్ రోషన్ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ ట్రైలర్ కే హైలెట్ గా నిలిచాయి. కియారా అద్వానీ, జాన్ అబ్రహం, షాబిర్ ఆహ్లూవాలియా తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్రీతమ్ చక్రవర్తి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఏడాది ఆగష్టు 14న ఇండిపెండెన్స్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Previous Articleమాంచెస్టర్ టెస్టు: భారత్ మొదటి ఇన్నింగ్స్ 358 ఆలౌట్: రిషబ్ పంత్ అద్భుతమైన ఇన్నింగ్స్
Next Article విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ ట్రైలర్ విడుదల