ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) ఖాతాదారులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కీలక ప్రకటన జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న జన్ ధన్ ఖాతాదారులు సెప్టెంబర్ 30 నాటికి తమ రీ-కేవైసీ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఖాతాదారుల సౌలభ్యం కోసం గ్రామ పంచాయతీ స్థాయిలోనే ప్రత్యేక క్యాంపులను నిర్వహించాలని బ్యాంకులను ఆదేశించింది. జూలై 1న ప్రారంభమైన ఈ కార్యక్రమం సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుంది.
ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన పథకం ప్రారంభమై 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేడు తెలిపారు. రూల్స్ ప్రకారం, యాంటీ-మనీ లాండరింగ్ ప్రోటోకాల్స్‌లో భాగంగా ప్రతి పదేళ్లకు ఒకసారి కస్టమర్ వివరాలను ధృవీకరించుకోవడం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ ఏడాది పెద్ద సంఖ్యలో జన్ ధన్ ఖాతాలకు కేవైసీ అప్‌డేషన్ గడువు ముగియనుందని, గడువులోగా రీ-కేవైసీ పూర్తి చేయని ఎకౌంట్లపై లావాదేవీల పరిమితులు విధించడం లేదా తాత్కాలికంగా సస్పెండ్ చేసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా సుమారు లక్ష గ్రామ పంచాయతీలలో బ్యాంకులు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాయి. ఈ క్యాంపులలో రీ-కేవైసీ సేవలతో పాటు, కొత్త బ్యాంక్ ఖాతాలు తెరవడం, సూక్ష్మ బీమా, పెన్షన్ పథకాలలో చేరడం, కస్టమర్ల ఫిర్యాదులను పరిష్కరించడం వంటి సేవలను కూడా అందిస్తున్నాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు