నూతన బార్ పాలసీ సహా పలు కీలక నిర్ణయాలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో నూతన బార్ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఏపీ సమాచార, ప్రసారశాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ‘స్త్రీ శక్తి’ పేరుతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి క్యాబినెట్ పచ్చజెండా ఊపిందన్నారు. సమావేశంలో నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వివరించారు. రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని.. అరకు, భవానీ ఐలాండ్స్ ని అభివృద్ధి చేసి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని వివరించారు.రూ.900 కోట్ల ఏపీ బీడీసీఎల్ రుణాలకు ప్రభుత్వ హామీకి మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. వైష్ణవి ఇన్ఫ్రా కంపెనీకి 25 ఎకరాల టీటీడీ భూమిని ఇచ్చేందుకు క్యాబినెట్ అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. బీసీ వర్గాల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. మత్స్యకారులు, నాయీ బ్రాహ్మణులకు గౌరవ వేతనం పెంచామన్నారు. 40వేల హెయిర్ కటింగ్ షాపులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు