కృష్ణా నది పరివాహక ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు క్రమంగా వరద నీరు పెరుగుతోంది. శ్రీశైలం ఇన్ ఫ్లో 1,99,714 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 1,00,800 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885…ప్రస్తుతం 881.20 అడుగుల నీటిమట్టం ఉంది. పూర్తి నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకు ప్రస్తుతం 194.30 టీఎంసీల నీరు ఉంది. ఇక నాగార్జునసాగర్ ప్రాజెక్టు కూడా జలకళను సంతరించుకుంది. శ్రీశైలం నుంచి సాగర్ కు వరద ప్రభావం పెరిగింది. దీంతో 8 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 64,465 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ కు 65,800 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. 1,10,483 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి, ప్రస్తుత నీటి మట్టాలు 590 అడుగులుగా ఉన్నాయి. సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా , ప్రస్తుతం అంతే స్థాయిలో నీరు నిల్వ ఉంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు