దేశ అత్యున్నత న్యాయస్థానం దేశ రాజధాని ఢిల్లీలో నేషనల్ కేపిటల్ రీజియన్ లో వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. వీధుల్లో కుక్కల వలన కుక్క కాటు, రేబిస్ వంటి వాటి వలన మరణాలు పెరుగుతుండడంతో ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో ఈ ఆదేశాలు జారీచేసింది. 8 వారాల లోపు అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని స్పష్టం చేసింది. ఈ చర్యలను అడ్డుకునేందుకు ఏవైనా సంస్థలు ప్రయత్నిస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. వీధి కుక్కల వలన ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో రేబిస్ మరణాల సంఖ్య పెరుగుతోందని వస్తున్న వార్తలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ పార్థివాలా, జస్టిస్ ఆర్.మహాదేవన్ లతో కూడిన ధర్మాసనం ఈ విషయంపై విచారణ చేపట్టింది. ఇక దీనిపై కేంద్రం వాదనలు మాత్రమే వింటామని తమ ఆదేశాలకు వ్యతిరేకంగా జంతు ప్రేమికులు, ఇతర పార్టీలు, సంస్థలు వేసిన పిటిషన్ లు విచారించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది.
వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
By admin1 Min Read