పశ్చిమమధ్య, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైన నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ జాగ్రత్తలు సూచించింది. ఇది రాబోయే 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడనున్నాయి.కోనసీమ, కాకినాడ, , అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.పల్నాడు, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది.విజయనగరం, పార్వతీపురంమన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.కృష్ణానది వరద ప్రవాహం పెరుగుతోంది.ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో,ఔట్ ఫ్లో 5,20,531 క్యూసెక్కులుగా ఉంది. కృష్ణానది పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపి విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ సూచించారు.
Previous Articleలాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ మరో ఘనత
Next Article ఆ 65 లక్షల మంది వివరాలను బహిర్గతం చేయండి: సుప్రీం