కొరియా ఎలక్ట్రానిక్స్ కంపెనీ శామ్ సంగ్ భారత్ లో ల్యాప్ టాప్ తయారీ ప్రారంభించింది. గ్రేటర్ నోయిడాలో ఉన్న తమ ఫ్యాక్టరీలో ఈ ప్రొడక్షన్ మొదలైంది. ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీలో ఫీచర్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లను కంపెనీ తయారు చేస్తోంది. ల్యాప్ టాప్ కూడా తయారు చేయడంతో భారత్ లో తమ తయారీ సామర్ధ్యాన్ని విస్తరించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్, శామ్ సంగ్ సౌత్ వెస్ట్ ఆసియా అధ్యక్షుడు జేబీ పార్క్, కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ ఎస్పీ చున్ తాజాగా సమావేశమైన విషయం తెలిసిందే.
భారత్ లో టాలెంట్, ఇన్నోవేషన్ ఆధారంగా శామ్ సంగ్ అధునాతన టెక్ ప్రొడక్ట్ లను తయారు చేస్తుందని ఈ మీటింగ్ తర్వాత పార్క్ చెప్పారు. భారత్ లో ల్యాప్ టాప్ తయారీకి సన్నాహాలు మొదలయ్యాయని ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీ ఎలక్ట్రానిక్స్ విభాగం అధ్యక్షుడు టీఎం రోహ్ ప్రకటించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు