ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై జరిగిన దాడి ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. సీఎం రేఖా గుప్తాకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ రోజు ఉదయం సీఆర్పీఎఫ్ బలగాలు సీఎం నివాసానికి చేరుకున్నాయి. సీఎం సెక్యూరిటీ బాధ్యతలను ఢిల్లీ పోలీసుల నుండి స్వీకరించాయి. సీఎం వ్యక్తిగత భద్రతతో పాటు సీఎం నివాసానికి, క్యాంపు కార్యాలయానికి 24 గంటలూ భద్రత కల్పించేందుకు అధికారులు అదనపు బలగాలను మోహరించారు.
బుధవారం సీఎం రేఖా గుప్తా తన అధికారిక నివాసంలో “జన్ సున్వాయ్” కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రేఖా గుప్తాపై ఒక వ్యక్తి దాడి చేశాడు. దాడికి పాల్పడిన దుండగుడు సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశాడు… పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. దాడి ఘటనను ఢిల్లీ బీజేపీ తీవ్రంగా ఖండించింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు