అక్టోబరు 24, 25 తేదీల్లో ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పు మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రంలో తాజాగా అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ రేపటికి వాయుగుండంగా మారుతుందని, అక్టోబరు 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ తుపాను వాయవ్య దిశగా పయనిస్తుందని, అక్టోబరు 24 ఉదయం ఒడిశా-బెంగాల్ తీరాలకు అనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని ఏపీఎన్డీఎంఏ పేర్కొంది. అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని అక్టోబరు 22 నుంచి 25 వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని, సముద్రంలో ఇప్పటికే వేటకు వెళ్లిన వారు వెంటనే తీరానికి చేరుకోవాలని ఏపీఎన్డీఎంఏ స్పష్టం చేసింది. ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు