ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 73 పాయింట్లు పడి 81,151 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 73 పాయింట్లు కోల్పోయి 24,781 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 131 పాయింట్ల నష్టంతో 51,963 వద్దకు చేరింది.