Mahindra XUV 3xo EV : మహీంద్రా సరికొత్త ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ భారత మార్కెట్లో విజయవంతమైంది. ఈ కంపెనీ పోర్ట్ ఫోలియోలో అత్యధికంగా అమ్ముడైన మూడో కారుగా నిలిచింది. ఇప్పుడు ఈ మోడల్ నుంచి ఎలక్ట్రిక్ వెర్షన్ రాబోతోంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఇండియన్ మార్కెట్లో మంచి విజయాన్ని అందుకుంది. కంపెనీ పోర్ట్ ఫోలియోలో అత్యధికంగా అమ్ముడైన మూడో కారుగా ఉంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ తన ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కస్టమర్లకు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఎక్స్‌యూవీ ఎలక్ట్రిక్ మోడల్ టెస్టింగ్ సమయంలో కనిపించింది. బయటకు వచ్చిన వివరాల ప్రకారం ఈ ఎలక్ట్రిక్ ఎక్స్‌యూవీ ఎక్స్టీరియర్, ఇంటీరియర్, ఫీచర్ల గురించి కొన్ని కొత్త వివరాలు వెల్లడయ్యాయి. వచ్చే ఏడాది దీన్ని లాంచ్ చేయాలని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం.