సంఘ సంస్కర్త, కవి గాయకుడు, కృష్ణతత్వ భక్త అగ్రగణ్యుడు శ్రీశ్రీశ్రీ గురు కనకదాస జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో మార్పు తీసుకువచ్చేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. కర్ణాటకలో జన్మించిన శ్రీశ్రీశ్రీ గురు కనకదాస రాయలసీమలోనూ కుల వ్యవస్థ, అసమానతలపై చైతన్యం తీసుకొచ్చిన సామాజిక తత్వవేత్త. బీసీలను, వారి సాంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ, వారి ఉన్నతి కోసం ప్రతి ఒక్కరూ పని చేయాల్సిన అవసరం గుర్తు చేసిన మహనీయుడని అన్నారు. భక్తి మార్గంలో ఆయన చేసిన బోధనలు నేటికీ అనుసరణీయం. ప్రజలకు అర్థమయ్యే రీతిలో సరళమైన భాషలో ఆయన ఎన్నో ఏళ్ల కిందట చేసిన బోధనలు ఈనాటి సమాజానికి కూడా మార్గదర్శనం చేస్తున్నాయంటే ఆ మహనీయుడి దార్శనికతను మనం అర్ధం చేసుకోవచ్చు. శ్రీశ్రీశ్రీ గురు కనకదాస బోధనలు సమాజాన్ని సక్రమ మార్గంలో నడిపించేందుకు ఉపకరిస్తాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అందుకే కనకదాస జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు.
కనకదాస వారి బోధనలు సమాజాన్ని సక్రమ మార్గంలో నడిపించేందుకు ఉపకరిస్తాయి: ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read